’35 – చిన్న క‌థ కాదు’ అంటోన్న నివేదా థామ‌స్


టాలీవుడ్ లో హీరో నాని నటించిన ‘జెంటిల్ మెన్’ మూవీతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన మ‌ల‌యాళ బ్యూటీ నివేదా థామ‌స్ త‌న యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇక ఆ సినిమా త‌రువాత వ‌రుస‌గా ప‌లు హిట్ సినిమాల్లో న‌టించి నివేదా త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

అయితే, ఈమ‌ధ్య ఈ బ్యూటీ ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డం లేదు. ‘శాకిని డాకిని’ త‌రువాత నివేదా థామ‌స్ తెలుగు సినిమాను ఓకే చేయ‌లేదు. దీంతో ఆమె ఎందుకు సైలెంట్ అయ్యిందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూశారు. కానీ, ఇప్పుడు ఆమె త‌న కొత్త ప్రాజెక్టును రిలీజ్ కు రెడీ చేసింది. రానా ద‌గ్గుబాటి నిర్మాత‌గా ’35 – చిన్న క‌థ కాదు’ అంటూ త‌న కొత్త సినిమా టైటిల్ ను రివీల్ చేసింది ఈ బ్యూటీ.

ఈ సినిమాలో నివేదా లీడ్ రోల్ లో న‌టిస్తుండగా ప్రియ‌ద‌ర్శి, విశ్వ‌దేవ్ లు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాను నంద కిషోర్ డైరెక్ట్ చేస్తుండ‌గా, ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 15న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. ఎట్ట‌కేల‌కు త‌మ అభిమాన న‌టి సినిమా వ‌స్తుండ‌టంతో నివేదా అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version