దీపావళి పండుగ రోజున నైజాంలో సర్దార్, ఓరి దేవుడా, కాంతార వసూళ్లు ఇవే!

దీపావళి పండుగ రోజున నైజాంలో సర్దార్, ఓరి దేవుడా, కాంతార వసూళ్లు ఇవే!

Published on Oct 26, 2022 2:01 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం సర్దార్. సినిమా స్లో నోట్‌లో ప్రారంభమైనప్పటికీ, బలమైన మౌత్ టాక్ తో సినిమా కలెక్షన్స్‌ బాగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం విడుదలైన నాలుగో రోజుకే (సోమవారం) నైజాంలో 72 లక్షల రూపాయలను వసూలు చేసింది. మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా చిత్రం నైజాంలో నాల్గవ రోజు (సోమవారం) 40 లక్షల రూపాయలను వసూలు చేసింది. సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం కాస్త డల్ గా ఉన్నాయి.

అయితే నైజాం లో కాంతార చిత్రం తన దూకుడు ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం పండుగ రోజున 1.1 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రం కి దీపావళి వీకెండ్ కూడా కలసి రావడం తో నేడు మంచి మార్క్ ను టచ్ చేయనుంది. ఈ రోజుతో హాలిడే సీజన్ ముగియనుండడంతో రేపటి నుంచి ఈ సినిమాలు ఎంత వరకు వసూళ్లు సాధిస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు