నైజాం లో ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిన “హిట్2”

నైజాం లో ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిన “హిట్2”

Published on Dec 5, 2022 12:38 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ హిట్ 2. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి పాజిటివ్ టాక్ రావడం తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. గమనించదగిన విషయం ఏమిటంటే ఈ చిత్రం ఇప్పటి వరకూ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ ను సాధించింది.

నైజాం ఏరియా లో నిన్న 1.4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇక్కడ మూడు రోజులోనే 5 కోట్ల రూపాయలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో నైజాం ఏరియా బ్రేక్ ఈవెన్ ను సాధించింది. హిట్2 సక్సెస్ కావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు