రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సలార్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలకి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా అయితే ప్రభాస్ ను చూడాలి అని అనుకుంటున్నారో, ప్రశాంత్ నీల్ అలా ప్రెజెంట్ చేసినట్లు రిలీజైన ట్రైలర్లలో చూడవచ్చు.
అయితే ఈ సినిమా డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం నైజాం ఏరియా లో అడ్వాన్స్ బుకింగ్ ఈరోజు రాత్రి 8:24 గంటలకి స్టార్ట్ కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.


