పుష్ప-2’ రిలీజ్ ఓకే.. మరి 3D ఏమైంది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో, ఈ సినిమాపై నెలకొన్న హైప్‌ను మరింతగా పెంచేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు అడ్వాన్స్ బుకింగ్స్‌తో ‘పుష్ప-2’ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పుడు ‘పుష్ప-2’కి సంబంధించిన ఓ టాపిక్‌పై చర్చ సాగుతోంది.

‘పుష్ప-2’ చిత్రాన్ని 3Dలో కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. ఇప్పటికే దూసుకెళ్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కూడా 2డీ షోలకు సంబంధించినవే. 4డీఎక్స్‌లో ఒక్క థియేటర్‌లో మాత్రమే షోలు పడుతున్నాయి. ఇక టికెట్ బుకింగ్స్‌లో 3D అనే మాట కూడా లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

‘పుష్ప-2’ 2డీ ఫైనల్ అవుట్‌పుట్ ఓకే కావడానికే సుకుమార్ తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఎడిటింగ్ వర్క్స్‌తో సుకుమార్ పడ్డ కష్టం మామూలుది కాదు. ఇక 3Dలో ఈ సినిమా వెర్షన్‌ను ఎడిట్ చేసినా, తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ 2డీకే ప్రాధాన్యత ఇస్తారని భావించారు. దీంతో 3D వెర్షన్‌ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో తెలుగు స్టేట్స్‌లో 3D రిలీజ్ ఊసే లేకుండా పుష్ప-2 రిలీజ్ అవుతోంది.

Exit mobile version