ఈ మహమ్మారి కరోనా మూలాన అత్యధికంగా నష్టపోతున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి అని తెలిసిందే. ముఖ్యంగా సినిమాని నమ్ముకున్న థియేటర్స్ వారు బాగా నష్టపోయారు. అయితే తెలంగాణాలో ఏమో కానీ ఏపీలో మాత్రం పరిస్థితి వేరే అని చెప్పాలి. ఇప్పటికే కరోనా మూలాన చాలా నష్టాలు చూసారు.
దానికి తోడు అక్కడ లాస్ట్ చిత్రం “వకీల్ సాబ్” నుంచి ఒక్కసారిగా టికెట్ రేట్ లు తగ్గించడం దానిపై మళ్ళీ పెంచుతారు అన్న దానిపై ఇంకా సరైన క్లారిటీ రాపోవడం డిస్ట్రిబ్యూటర్లను కలవరపెడుతుంది. ఇటీవల ఇచ్చిన కొత్త జీవో కూడా సంతృప్తి ఇవ్వకపోవడంతో టికెట్ రేట్లు కనుక ముందులా పెంచని పక్షంలో పలు చోట్ల థియేటర్లు తెరవకూడదని నిశ్చయించుకున్నారని టాక్.
అయితే ఇది వరకే వకీల్ సాబ్ సినిమా విషయంలో కూడా సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం మూలాన అనేక చోట్ల సినిమా ప్రసారం నిలిపివేసి నిరసనగా థియేటర్స్ మూసేసారు. మరి ఇప్పుడు కొత్త సినిమాలు థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.