‘గేమ్ ఛేంజర్’లో ఫుల్ సాంగ్స్ కనిపించవా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో చేస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే, న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని చిత్ర ఎడిటర్ రూబెన్స్ తాజాగా వెల్లడించారు. సోషల్ మీడియా చిట్ చాట్‌లో ఆయన ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ‘గేమ్ ఛేంజర్’ చిత్ర రన్‌టైమ్ దాదాపు 2 గంటల 45 నిమిషాలుగా ఉండనుందని.. అయితే, థియేట్రికల్ కట్‌లో ఈ సినిమాలో ఫుల్ సాంగ్స్ కనిపించవని.. వాటిని సినిమా రిలీజ్ తరువాత యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

దీంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో పూర్తి స్థాయి పాటలు కనిపించవనే విషయం రివీల్ అయ్యింది. ఇక ఈ విషయంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ కు లోనవుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version