‘గేమ్ ఛేంజర్’ ఎఫెక్ట్ ఏమాత్రం లేకుండా ‘పెద్ది’ బిజినెస్!?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ దెబ్బతో మొత్తం గేమ్ ని రామ్ చరణ్,బుచ్చిబాబులు మార్చేశారు. ఇలా దీనికి ముందు ఉన్న గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఈ సినిమాపై ఇంచ్ కూడా లేనట్టు తెలుస్తుంది.

ఇలా ఒక్క ఓటిటి నుంచే కాకుండా థియేట్రికల్ వరకు కూడా రికార్డు ఆఫర్స్ పెద్ది చిత్రానికి వస్తున్నాయట. దీనితో గ్లోబల్ స్టార్ పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగానే ఈ కాంబినేషన్ సినిమా అదరగొడుతుంది అనే చెప్పి తీరాలి. ఇక ప్రస్తుతం ఓటిటిలో ఓ పేరు మోసిన సంస్థ ఆల్ టైం హైయెస్ట్ ఫిగర్ ని కూడా ఆఫర్ చేశారట. మరి పెద్ది లెక్కలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version