Pushpa 2: “పుష్ప 2” నుంచి ఇక కేవలం ఇవి మాత్రమే..

Pushpa 2: “పుష్ప 2” నుంచి ఇక కేవలం ఇవి మాత్రమే..

Published on Sep 19, 2024 10:07 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ మరో సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నది ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటుండగా ఈ సినిమా నుంచి నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ పై అయితే ఒక ఊహించని క్లారిటీనే వచ్చింది అని చెప్పాలి. పుష్ప 2 నుంచి ఇక నెక్స్ట్ ఎలాంటి టీజర్ రాబోయేది లేదట. డైరెక్ట్ గా పాటలు అలాగే ట్రైలర్ మాత్రమే రాబోతోంది అని బన్నీ కాంపౌండ్ నుంచి లేటెస్ట్ క్లారిటీ వచ్చేసింది.

సో పుష్ప 2 నుంచి ఇక ఎలాంటి గ్లింప్స్ కానీ టీజర్ కానీ వచ్చేది లేదని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 6న గ్రాండ్ గా ఈ చిత్రం విడుదలకి రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు