‘తండేల్’ ఓకే.. ఆ తర్వాత…?

‘తండేల్’ ఓకే.. ఆ తర్వాత…?

Published on Feb 2, 2025 3:00 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్ తర్వాత మంచి హైప్ తెచ్చుకున్న సినిమాగా ‘తండేల్’ నిలిచింది.

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 7న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ వారంలో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో లైలా, బ్రహ్మా ఆనందం, దిల్‌రూబా ఉన్నాయి. కానీ, ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల్లో బజ్‌ని క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాకు ప్రేక్షకలు ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు