టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, వారికి నిరాశను మిగిలిస్తూ ఈ చిత్రానికి ఎలాంటి పెయిడ్ ప్రీమియర్స్ ఉండబోవని మేకర్స్ స్పష్టం చేశారు. అంతేగాక, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో దేశవ్యాప్తంగా మార్చి 28న ఉదయం 7 గంటలకు ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీంతో ఈ సినిమాను శుక్రవారం ఉదయాన్నే వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ మరోసారి తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.