రాబిన్‌హుడ్ ప్రీమియర్స్ అందుకే వేయడం లేదు – నిర్మాత రవి శంకర్

రాబిన్‌హుడ్ ప్రీమియర్స్ అందుకే వేయడం లేదు – నిర్మాత రవి శంకర్

Published on Mar 26, 2025 7:00 PM IST

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ మార్చి 28న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ ప్రెస్ మీట్‌లో నిర్మాత రవి శంకర్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల చాలా సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారని.. అయితే, రాబిన్‌హుడ్ చిత్రానికి ఎలాంటి ప్రీమియర్స్ ఉండబోవని ఆయన అన్నారు. కథలో ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పుడు సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసిన ఒకే విధంగా ఫలితం వస్తుందని ఆయన అన్నారు. అయినా, గతకొంత కాలంగా తమకు ప్రీమియర్స్ కలిసి రావడం లేదని ఆయన ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

దీంతో ఈ వారం రిలీజ్ కానున్న రెండు తెలుగు చిత్రాలు రాబిన్‌హుడ్, మ్యాడ్ స్క్వేర్ ఎలాంటి పెయిడ్ ప్రీమియర్స్ లేకుండా నేరుగా థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇక రాబిన్‌హుడ్ చిత్రంలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. జీ.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు