గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సాలిడ్ పొలిటికల్ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం గేమ్ ఛేంజర్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా చూడని భారీ నెగిటివ్ ని చూడాల్సి వచ్చింది.
అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన నెల లోపే ఓటిటికి కూడా వచ్చేసింది. దక్షిణాది భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. కానీ హిందీ వెర్షన్ లో మాత్రం జీ5లో సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇంట్రెస్టింగ్ తెలుగు వెర్షన్ ఓటిటిలో వచ్చాక బాగానే రెస్పాన్స్ వచ్చింది కానీ ఇపుడు హిందీలో వచ్చాక కనీసం ఊసే లేదని చెప్పాలి.
మామూలుగా ఓ సౌత్ సినిమాకి హిందీ ఆడియెన్స్ లో మినిమమ్ రెస్పాన్స్ ఓటిటిలో వచ్చాక అయినా ఉంటుంది. కానీ అనూహ్యంగా గేమ్ ఛేంజర్ చిత్రంకి కనీసం రెస్పాన్స్ సోషల్ మీడియాలో కూడా రాలేదు. దీనితో హిందీ వెర్షన్ లో మాత్రం గేమ్ ఛేంజర్ ప్లాప్ అనే అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.