నార్త్ లో “గేమ్ ఛేంజర్”కి అప్పటివరకు ఇబ్బంది లేదా!?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. అయితే ఈ సినిమాకి ఎంతటి నెగిటివిటీ జరిగిందో అందరికీ తెలిసిందే. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ దానికి మించిన నెగిటివ్ ప్రచారం భారీ స్థాయిలో ఈ సినిమాకి జరిగింది.

దీనితో మేకర్స్ కూడా స్పందించారు. మరి డే 2 నుంచి గేమ్ ఛేంజర్ వసూళ్లపై ఇది ఎఫెక్ట్ పడింది కానీ ఒక దగ్గర మాత్రం ఈ సినిమాకి స్టడీ వసూళ్లు దక్కుతున్నాయని చెప్పాలి. అదే హిందీ మార్కెట్ లో. నార్త్ లో గేమ్ ఛేంజర్ కి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇంట్రెస్టింగ్ గా మూడు రోజులు కూడా ఇదే కొనసాగింది.

దీనితో రానున్న ఇంకొన్ని రోజులు పాటుగా గేమ్ ఛేంజర్ కి అక్కడ మంచి వసూళ్లు రానున్నాయి అని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఈ జనవరి 23 వరకు సరైన సినిమాలు ఏవి లేవట. సో అప్పుడు వరకు హిందీ మార్కెట్ లో మాత్రం గేమ్ ఛేంజర్ కి పెద్దగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. మరి ఈ ఉన్న రోజులు అక్కడ ఎలాంటి పెర్ఫార్మన్స్ ని ఈ సినిమా చేస్తుందో చూడాలి.

Exit mobile version