ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో ఒక సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా బాలయ్య గత చిత్రాలు కంటే క్రేజీ హైప్ దీనిపై నెలకొంది. ఇక ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ పండుగ సందర్భంగా అయితే ఏదన్నా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
బాలయ్య సహా ఇతర సీనియర్ స్టార్స్ నుంచి సినిమాలు సహా సినిమాల అప్డేట్స్ కూడా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. కానీ బాలయ్య సినిమాకి సంబంధించి ఎలాంటి ఊసు లేదు. దీనితో ఈ పండుగకి బాలయ్య నుంచి ట్రీట్ లేనట్టే అనుకోవాలి. మరి సడెన్ గా ఏమన్నా అప్డేట్ కానీ సినిమా లుక్ కానీ రివీల్ చేస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.