Pushpa 2: “పుష్ప 2” ఆ లీక్ లో ఎలాంటి నిజం లేదు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలం నుంచి ఊరిస్తున్న ఈ సెన్సేషనల్ సీక్వెల్ డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పాన్ ఇండియా వైడ్ గా హిట్ గా నిలిచాయి.

ఇక నెక్స్ట్ వచ్చే సాంగ్స్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ తో పాటుగా క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించారు. దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఓ మాస్ మ్యూజిక్ బిట్ లీక్ అయ్యినట్టుగా ఒక క్లిప్ వైరల్ గా మారింది.

దీనితో చాలా మంది దీనిని నిజంగా సినిమా నుంచే లీక్ అనుకుంటున్నారు. కానీ అది సినిమా కోసం ప్రిపేర్ చేసింది కాదట, యూట్యూబ్ లో ఫ్యాన్ మేడ్ కంపొజిషన్ అన్నట్టు తెలుస్తుంది. దానిని లీక్ లా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు తప్ప ఇది సినిమా లోనిదే అనే మాటలో అయితే ఎలాంటి నిజం లేదు.

Exit mobile version