రవితేజ సినిమా మీద ఆ వార్తలు నిజం కాదట

Published on Feb 24, 2021 12:10 am IST

మాస్ మహారాజ్ రవితేజ తాజాగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ‘నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే’ లాంటి సినిమాలను తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించనున్నారు. వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాత. రవితేజకు ఇది 68వ సినిమా. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ–స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘ఖిలాడి’ చిత్రీకరణ పూర్తవగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

అయితే ఈ సినిమా విషయంలో ఒక రూమర్ తెగ హడావుడి చేస్తోంది. అదేమిటంటే ఇందులో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తారని, సినిమా ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ అని. కాపోతే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. సినిమాలో రవితేజ న్యాయవాది పాత్రలో నటించట్లేదని, వేరొక పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆ పాత్ర ఏంటి, ఎలా ఉండబోతుంది లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో రవితేజకు జోడీగా ఎవరు నటిస్తారనేది కూడ ఫైనల్ కాలేదు.

సంబంధిత సమాచారం :