“ఓజి” ఆ రూమర్స్ లో నిజం లేనట్టేగా!?

“ఓజి” ఆ రూమర్స్ లో నిజం లేనట్టేగా!?

Published on Oct 26, 2024 3:09 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలై చాలా త్వరగానే షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది.

కానీ అనూహ్యంగా ఈ సినిమా చాలా కాలం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ మధ్యనే షూట్ ని స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా దర్శకుడు సుజీత్ బర్త్ డే నేడు కావడంతో చిత్ర యూనిట్ తనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఓజి కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న ఆస్కార్ రవి చంద్రన్ సినిమా నుంచి తప్పుకోనున్నారు అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈరోజు తాను సుజీత్ కి విషెస్ చెప్పడమే కాకుండా ఓజి పేరు కూడా మెన్షన్ చేశారు. సో ఆ రూమర్స్ లో నిజం లేదనే అనుకోవచ్చు. తప్పుకోవాలి అనుకుంటే ఇన్నాళ్లు ఈ సినిమాకి వర్క్ చెయ్యని రోజుల్లోనే తప్పుకొని ఉండొచ్చు ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యాక తప్పుకుంటారు అంటే నమ్మేలా లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు