యాక్టర్ నోయెల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ’14’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను మెట్ల రాయల్ పిక్చర్స్ బ్యానర్ పై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న “14” కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించిన చిత్ర యూనిట్ కు అభినందనలు..” అని అన్నారు.
ఇక ఈ సినిమాలో విషాక ధీమాన్ హీరోయిన్ గా నటించగా రతన్, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగర్, రూపలక్ష్మి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.