విజయ్ “గోట్” తెలుగు హక్కులు ప్రముఖ సంస్థకి?


కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) గా పిలవబడే సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఇది విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా తెరకెక్కిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కి తెలుగు సహా హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

మరి తెలుగులో అయితే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని రూమర్స్ మొదలయ్యాయి. వారే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అట. అయితే ప్రస్తుతానికి ఇందులో నిజం లేనట్టే అని తెలుస్తుంది. కోలీవుడ్ వర్గాలు నుంచి స్ప్రెడ్ చేయబడినవి తప్ప ఇంకా ఎలాంటి డీల్స్ క్లోజ్ కానట్టే టాక్. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version