ప్రముఖ నిర్మాణ సంస్థతో మాస్ మహారాజ్ సినిమా.?

Published on Sep 16, 2020 3:00 am IST


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “డిస్కో రాజా” ఎన్నో అంచనాల నడుమ విడుదలై ఊహించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఎంతో ఇష్టపడి లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం రాణించకపోవడంతో రవితేజ మళ్లీ తన మాస్ ఫార్మాట్ లోకి అడుగు పెట్టి తన హిట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో “క్రాక్” అనే పవర్ఫుల్ మాస్ ఫ్లిక్ ను ప్లాన్ చేసి దానిపైనే ఆశలు పెట్టుకున్నారు.

అయితే దీని తర్వాత రవితేజ మరో రెండు ప్రాజెక్టులను చేయనున్నారు. ఇపుడు రవితేజ తో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక చిత్రాన్ని తీసేందుకు రెడి అయ్యారట. వారు మరెవరో కాదు యూవీ క్రియేషన్స్ వారే.. దగ్గరగా 20 కోట్లు లోపు ప్రాజెక్ట్ ను వీరు మాస్ మహారాజ్ తో ప్లాన్ చెయ్యనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More