ఇపుడు “గేమ్ ఛేంజర్” ప్రీరిలీజ్ పైనే అందరి కళ్ళు..!

ఇపుడు “గేమ్ ఛేంజర్” ప్రీరిలీజ్ పైనే అందరి కళ్ళు..!

Published on Jan 4, 2025 9:01 AM IST

మన టాలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ భారీ చిత్రమే “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే హీరోయిన్ అంజలి మరో హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ఈ “గేమ్ ఛేంజర్”. ఒక్క రామ్ చరణ్ మాత్రమే కాకుండా మళ్ళీ శంకర్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇలా లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో అంతా ఓ రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారు.

ఇక ఈ ట్రైలర్ తర్వాత నెక్స్ట్ బిగ్ ఫెస్టివల్ నేడు జరగనున్న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి రాబోతుండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరింత పవర్ స్పెషల్ గా మారింది. అలాగే శంకర్ సినిమాల ఈవెంట్స్ అంటే చాలా యునిక్ గా కూడా ఉంటాయి. పైగా తెలుగులో మొదటి ఈవెంట్ తన నుంచి కావడంతో మరిన్ని అంచనాలు రేకెత్తుతున్నాయి. దీనితో “గేమ్ ఛేంజర్” ప్రీరిలీజ్ ఈవెంట్ పైనే ఇపుడు అందరి కళ్ళు పడ్డాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు