నెట్ ఫ్లిక్స్ కి ఇండియన్ సెన్సార్ కోత..!

వరల్డ్ వైడ్ గా మంచి పాపులర్ అయ్యినటువంటి పలు ఓటిటి స్ట్రీమింగ్ సంస్థల్లో అయితే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. మరి ఇందులో వరల్డ్ వైడ్ గా ఎన్నో భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉంటుంది అని తెలిసిందే. అలాగే మన ఇండియా నుంచి కూడా పలు భాషల్లో కంటెంట్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే మిగతా దేశాల్లో ఉన్నట్టుగానే ఇది వరకు నెట్ ఫ్లిక్స్ లో సెన్సార్ లాంటివి లేకుండా చాలా వరకు సెన్సిటివ్ కంటెంట్ ఉండేది.

కానీ ఇక నుంచి అయితే ఇది జరగదు అని రీసెంట్ గా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇండియన్ సెన్సార్ బోర్డు వారు నెట్ ఫ్లిక్స్ కి కూడా ఖచ్చితంగా సెన్సార్ ఉండాలని సూచించడంతో ఇక నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఉన్న కంటెంట్ కానీ ఇక నుంచి రాబోయే కంటెంట్ కానీ సెన్సార్ నియమాలు పాటించే అందుబాటులోకి ఉండనుంది. దీనితో పలు డైలాగ్స్ కానీ సన్నివేశాలు కానీ ఇండియా నుంచి ఉన్న వాటిలో సెన్సార్ తోనే ఇతర దేశాల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీనితో పలు సిరీస్ లు సినిమాలు కానీ ఇక నుంచి సెన్సార్ తోనే అందరు కలిసి చూడవచ్చు.

Exit mobile version