ఇక పవన్ ఫాన్స్ నడుం బిగించారు.!

Published on Oct 22, 2020 11:08 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద సినిమాల వరుస అప్డేట్స్ తో కోలాహలంగా మారింది. అయితే మన టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ స్టార్ హీరోలు అయిన యుంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు దాదాపు ఒకటే పరిస్థితుల్లో ఉన్నారు.

ఈ ఇద్దరి హీరోల సినిమాలు వచ్చి రెండేళ్లు దాటేశాయి. దీనితో మహా ఆకలిగా ఉన్న వీరు ఏ చిన్న ఉపాదాటీ వచ్చినా సరే భారీ రికార్డులే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా లేటెస్ట్ గా “రౌద్రం రణం రుధిరం” నుంచి భీం టీజర్ ను రాజమౌళి టీమ్ వదలగా తమ ర్యాంపేజ్ ఏంటో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ నిరూపిస్తున్నారు.

ఇక అంతే సమయంలో పవన్ అభిమానులు కూడా తమ అభిమాన హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” నుంచి రానున్న టీజర్ తో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ రికార్డులు సెట్ చెయ్యాలని ప్లాన్ లు వేస్తున్నారు.

ఇప్పుడు భీం టీజర్ తో తారక్ ఫ్యాన్స్ వ్యూస్ మరియు లైక్స్ విషయంలో భారీ రికార్డులు సెట్ చేసే విధంగా దూసుకెళ్లి బడా టార్గెట్ ను పెట్టారు. దీనితో అంతకు మించిన రికార్డులను సెట్ చెయ్యాలని పవన్ ఫ్యాన్స్ నడుం బిగించారు. మరి పవన్ ఫ్యాన్స్ ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More