మన టాలీవుడ్ సినిమా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుగు ఆడియెన్స్ ఎలాంటి సినిమాలు అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హీరోలు అందరికీ ఒక సెపరేట్ బ్రాండ్ ని సెట్ చేసిన పూరి ఇపుడు ఒక్క సరైన హిట్ ఇచ్చేందుకు స్ట్రగుల్ అవుతున్నారు.
అయితే పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన గత చిత్రం డబుల్ ఇస్మార్ట్ కూడా బాగా డిజప్పాయింట్ చేయడంతో ఇక నెక్స్ట్ సినిమా ఏంటి ఎవరితో అనేది ఒకింత సస్పెన్స్ గానే మారింది. మధ్యలో చాలా మంది టాలీవుడ్ హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఊహించని విధంగా తమిళ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమాని ఇపుడు అనౌన్స్ చేశారు.
ఇక దీనిపై ఇపుడు మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే విజయ్ సేతుపతి అంటే మినిమమ్ గ్యారెంటీ. అలాంటి నటుడ్ని పూరీ ఒప్పించారు అంటే ఈసారి కంటెంట్ సాలిడ్ గానే ఉంటుంది అని అర్ధం చేసుకోవచ్చు. దీనితో ఇపుడు చాలామందికి పూరి జగన్నాథ్ మంచి కంబ్యాక్ ఇస్తారని నమ్ముతున్నారు. మరి ఈసారి పూరి ఎలాంటి సబ్జెక్టుతో రానున్నారో చూడాలి.