ఇక నుంచి ఇండియాస్ ఆల్ టైం రికార్డ్ సలారోడి కంట్రోల్ లో.!

ఇక నుంచి ఇండియాస్ ఆల్ టైం రికార్డ్ సలారోడి కంట్రోల్ లో.!

Published on Jul 7, 2023 7:01 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్”. మరి నిన్న దీని నుంచి మేకర్స్ ఫస్ట్ టీజర్ ని సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయగా దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు అయింది. ఇక ఇప్పుడు ఈ టీజర్ అయితే ఇండియా లోనే ఏ సినిమా టీజర్ కూడా అందుకోని బిగ్గెస్ట్ రికార్డ్ అయితే సెట్ చేసింది.

సింగిల్ ఛానెల్లో 83 మిలియన్ కి పైగా భారీ వ్యూస్ అందుకున్న ఏకైక టీజర్ గా ఇప్పుడు సలార్ నిలిచింది. ఇది వరకు 78 మిలియన్ వ్యూస్ కి పైగా లెక్కలతో కేజీయఫ్ 2 టీజర్ ఉండగా ఇప్పుడు దీనిని సలారోడు కంట్రోల్ లో పెట్టుకున్నాడు. మొత్తానికి అయితే సలార్ మేనియా మున్ముందు మరింత భారీ స్థాయిలో ఉండనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబలే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు