దేవర: చివరి 40 నిమిషాలు మిమ్మల్ని బాగా అలరిస్తుంది – ఎన్టీఆర్

దేవర: చివరి 40 నిమిషాలు మిమ్మల్ని బాగా అలరిస్తుంది – ఎన్టీఆర్

Published on Sep 10, 2024 6:33 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27, 2024 న థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు, గ్లింప్స్ వీడియోలు ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా అలరించాయి. తాజాగా ట్రైలర్ ను తెలుగులో మాత్రమే కాకుండా, భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కొరటాల శివ దేవర చిత్రంతో మరో యూనివర్స్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్ట్, సెక్వెన్స్ గురించి చెప్పలేను కానీ, చివరి 30 – 40 నిమిషాలు అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అని అన్నారు. మీరంతా దేవర చిత్రాన్ని చూసేందుకు వేచి ఉండలేను అని అన్నారు. ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు