క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ పార్ట్స్ ‘కథానాయకుడు’ మరియు ‘మహానాయకుడు’. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ డిసెంబర్ 21వ తేదీన విడుదల అయింది. కీరవాణి అందించిన పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
గాయనీ గాయకులు : కైలాష్ ఖేర్
రచన : కె శివ దత్త, డా : కె రామకృష్ణ
ఈ ఆల్బమ్ ‘కథానాయక’ పాటతోనే మొదలవుతుంది. రచయితలు కె శివ దత్త, డా : కె రామకృష్ణ వ్రాసిన సాహిత్యానికి తగినట్లుగా కీరవాణి చక్కని బీట్స్ ను అందించి ఓ ప్రత్యేకమైన టైటిల్ సాంగ్ లా ఈ సాంగ్ ని తీర్చిదిద్దారు. ఈ ‘కథానాయక’ పాట ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా మ్యూజిక్ లవర్స్ ని కూడా ఆకట్టుకుంటుంది.
గాయనీ గాయకులు : ఎమ్ ఎమ్ కీరవాణి
రచన : ఎమ్ ఎమ్ కీరవాణి
ఈ పాటను సంగీత దర్సకుడు కీరవాణినే తన అమూల్యమైన గాత్రంతో ఆలపించారు. ఈ వెండితెర దొర పాట అప్పట్లో ప్రజల బాధలకు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే ప్రజల ఆకాంక్షలకి ప్రతి రూపంలా ఉంది. కీరవాణినే ఈ పాటను చాలా చక్కని పదాలతో ప్రజల కష్టాలను కళ్ళకు కట్టినట్లు హృదయానికి హత్తుకునేలా వ్రాశారు. ఇక ఈ సాంగ్ స్క్రీన్ పై ఎలా తెరకెక్కిందో సినిమాలో ఏ సిచ్యుయేషన్ లో వస్తుందో అనే అంశాల మీద ఈ పాట విజయావకాశాల స్థాయి ఆధారపడి ఉంది.
3. పాట : బంటురీతి కొలువు
గాయనీ గాయకులు : కె ఎస్ చిత్ర, శ్రీ నిధి తిరుమల
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రీ
ఈ బంటురీతి కొలువు పాట ఆల్బమ్ లో మూడో పాటగా వస్తుంది. ఇక పాట గురించి చెప్పాలంటే ఆల్బమ్ లోనే మంచి క్లాసిక్ పాట అని చెప్పొచ్చు. సింగర్స్ కె ఎస్ చిత్ర, శ్రీ నిధి తిరుమల తమ గానంతో ఈ పాటను చాలా చక్కగా పాడారు. కీరవాణి శ్రావ్యమైన సంగీతాన్ని అందించడంతోపాటు.. మధ్య మధ్యలో చక్కని బిట్స్ తో ఈ సాంగ్ ను తీర్చిదిద్దారు. ఇక ఈ పాట మహిళలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.
గాయనీ గాయకులు : శ్రీ నిధి తిరుమల, మోహన్ భోగరాజు, రమ్య బెహర
రచన : కె శివ దత్త, డా : కె రామకృష్ణ
ఈ పాటను గ్రాంధిక శైలిలో చాలా చక్కని పదాలతో వ్రాయటం జరిగింది. ఇక ఈ సాంగ్ విజయానికి స్క్రీన్ పై ఎలా తెరకెక్కిందో సినిమాలో ఏ సిచ్యుయేషన్ లో వస్తుందో అనే అంశాల మీద ఈ పాట విజయావకాశాల స్థాయి ఆధారపడిఉన్నాయి. అయితే పాట మాత్రం ఆల్బమ్ లోనే బెస్ట్ సాంగ్ అనిపించుకుంటుంది.
5. పాట : రామన్న కథ
గాయనీ గాయకులు : కె ఎస్ చిత్ర, సునీత
రచన : ఎమ్ ఎమ్ కీరవాణి
రామన్న కథ సాంగ్ ఈ ఆల్బమ్ లో ఐదో పాటగా వస్తోంది. ఈ పాటను కూడా సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి నే రాశారు. మంచి పదాలతో అర్ధవంతమైనా సాహిత్యం కారణంగా ఈ పాట బాగుంది. సింగర్స్ కె ఎస్ చిత్ర, సునీత తమ గానం మరియు రెగ్యులర్ విరామాలలో వచ్చే చక్కని మాడ్యులేషన్లు బాగున్నాయి.
గాయనీ గాయకులు : ఎమ్ ఎమ్ కీరవాణి, కాల భైరవ, సాయి శివాని, కీర్తి సగాతియా
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రీ
ఈ సాంగ్ ఈ ఆల్బమ్ లో ఆరవ పాటగా వస్తోంది. రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ ఈ పాటను ఉత్తేజకరమైన పదాలతో చాలా చక్కని వ్రాయటం జరిగింది. సింగర్స్ అద్భుతమైన గానంతో ఈ పాటను పాడారు. ఎన్టీఆర్ అభిమానులకు ఈ పాట ప్రత్యేకంగా అనిపిస్తోంది.
7. పాట : రాజర్షి
గాయనీ గాయకులు : ఎమ్ ఎమ్ కీరవాణి, కాల భైరవ, మోహన్ భోగరాజు, శరత్ సంతోష్
రచన : కె శివ దత్త, డా : కె రామకృష్ణ
ఆల్బమ్ లో చివరి పాటగా ఈ రాజర్షి పాట వస్తోంది. రచయితలూ కె శివ దత్త, డా : కె రామకృష్ణ ఈ పాటను అద్భుతమైన గ్రాంధిక పదాలతో శైలిలో చాలా చక్కగా వ్రాయటం జరిగింది. ఇక ఈ సాంగ్ మంచి విజయాన్ని సాధించింది. ఈ పాట మాత్రం ఆల్బమ్ లోనే బెస్ట్ సాంగ్ అనిపించుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
తీర్పు:
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా వస్తోన్న ‘కథానాయకుడు’ మరియు ‘మహానాయకుడు’లో డిసెంబర్ 21వ తేదీన ‘కథానాయకుడు’ ఫుల్ ఆడియో ఆల్బమ్ విడుదల అయింది. ఇప్పటికే ఈ ఆల్బమ్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఉన్న ఏడు పాటల్లోకి మూడు పాటలు పర్వాలేదనిపించినా, మరో మూడు పాటలు చాలా బాగున్నాయి. మరో పాట సినిమాకే బెస్ట్ సాంగ్ లా నిలిస్తోంది. మొత్తం మీద ఈ పాటలు సినిమాను ప్రేక్షకులకు ఇంకా బలంగా దగ్గర చేస్తాయి.