త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ బిజినెస్ ?

Published on Nov 29, 2020 12:12 am IST

త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ పాన్ ఇండియా మూవీ కోసం ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా దాదాపు పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ పక్కా ఎంటర్ టైనర్ గా తీసే ప్లాన్ లో ఉన్నాడట. సినిమాలో ఎన్టీఆర్ రెండు గెటప్స్ లో కనిపిస్తాడని.. ఒకటి అమెరికాలో ఉండే కమర్షియల్ బిజినెస్ మెన్ గెటప్ కాగా, మరొకటి రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.

కాగా బిజినెస్ మెన్ అయిన తారక్ పాత్ర ఇండియాకి వస్తాడని.. అయితే పక్కా బిజినెస్ మైండెడ్ అయిన హీరోకి ఇండియాలోని పాలిటిక్స్ కి మించిన బిజినెస్ లేదనిపిస్తోందని ఇక అప్పటినుండి హీరో జర్నీనే సినిమా కథ అని.. అయితే హీరో ఇదంతా చేయడానికి ఓ బలమైన రీజన్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో తారక్ పాలిటిక్స్ నే బిజినెస్ గా మార్చుకుని ప్రజలను కూడా కస్టమర్లుగా మార్చేస్తాడట. కాకపోతే హీరో చేసిన ప్రతి చెడు పనికి ఒక మంచి ఉంటుందని అది చివర్లో ట్విస్ట్ గా రివీల్ అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

సంబంధిత సమాచారం :

More