‘దావూదీ’ సాంగ్ అందుకే తీసేశాం – ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర రికార్డులను పాతర వేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్, ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తోంది.

తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ‘దేవర’ సినిమా రిలీజ్‌కి ముందు ఎంతో పాపలర్ అయిన ‘దావూదీ’ సాంగ్‌ని సినిమా నుంచి ఎందుకు తీసేయాల్సి వచ్చిందో తారక్ చెప్పుకొచ్చాడు. ‘దేవర’ సినిమా ఫైనల్ ప్రింట్ చూసినప్పుడు సినిమా కథలో లీనమై వెళ్తున్న తమకు ‘దావూదీ’ సాంగ్ రాంగ్ ప్లేస్‌మెంట్‌లా కనిపించిందని ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌తో ఏకీభవించి ఆ సాంగ్‌ను డిలీట్ చేసినట్లుగా తారక్ చెప్పాడు.

దీంతో ఈ సినిమాలో ‘దావూదీ’ సాంగ్‌ను ఎందుకు తీసేశారో ఇప్పటికి రివీల్ అయ్యిందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Exit mobile version