“అఖండ” సినిమా చూసిన జూ.ఎన్టీఆర్ ఏమన్నాడంటే..?

“అఖండ” సినిమా చూసిన జూ.ఎన్టీఆర్ ఏమన్నాడంటే..?

Published on Dec 3, 2021 12:30 AM IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్‌పై సినీ ప్రముఖులు స్పందిస్తూ బాలయ్య బాబుకు మరియు చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియచేస్తున్నారు.

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ ఇప్పుడే అఖండ సినిమా చూడటం పూర్తయిందని, మరో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయికి మరియు మొత్తం చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇలాంటి సక్సెస్ అభిమానులకు అనందించే క్షణాలని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు