‘ఆయుధపూజ’ సాంగ్‌కు స్టెప్పేసిన ఎన్టీఆర్.. హోరెత్తిన థియేటర్!

‘ఆయుధపూజ’ సాంగ్‌కు స్టెప్పేసిన ఎన్టీఆర్.. హోరెత్తిన థియేటర్!

Published on Mar 24, 2025 6:11 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘దేవర’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో వేరే లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి, ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యింది.

జపాన్‌లో ‘దేవర’ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు దర్శకుడు కొరటాలతో కలిసి ఎన్టీఆర్ జపాన్ వెళ్లాడు. అక్కడ తాజాగా ‘దేవర’ ప్రీమియర్ షోలో ఎన్టీఆర్, కొరటాల సందడి చేశారు. అభిమానులతో కలిసి వారు ముచ్చటించారు. దేవర చిత్రం జపాన్ అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ఆయుధపూజ’ సాంగ్‌కు అభిమానులు డ్యాన్స్ చేస్తుండగా, ఎన్టీఆర్ కూడా వారితో కలిసి స్టెప్పులు వేశాడు. దీంతో థియేటర్‌లో అభిమానులు తమ చప్పట్లతో హోరెత్తించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు