జక్కన్నపై చాలా నమ్మకంగా ఉన్న తారక్ ఫ్యాన్స్.!

జక్కన్నపై చాలా నమ్మకంగా ఉన్న తారక్ ఫ్యాన్స్.!

Published on Sep 20, 2020 3:45 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేస్తున్న మహా యాగం “రౌద్రం రణం రుధిరం”. ఊహలకు అందని రీతిలో రాజమౌళి ప్లాన్ చేస్తున్న ఈ భారీ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు పవర్ ఫుల్ మాస్ హీరోలను రాజమౌళి అందులోనూ ఇద్దరు పవర్ ఫుల్ స్వాతంత్య్ర సమరయోధులుగా చిత్రీకరిస్తుండడంతో చెప్పలేనని విధమైన అంచనాలను అభిమానులు పెట్టుకున్నారు.

అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ రోల్ అండ్ లుక్ ను టీజర్ ద్వారా ప్రెజెంట్ చేసి చరణ్ అభిమానులను ఖుషి చేసిన జక్కన్న తారక్ అభిమానులకు మాత్రం రోజురోజుకు బాకీ పడిపోతున్నాడు. ఈ ఒక్క విషయంలో వెలితి అనే మాట తప్ప ఇన్ని రోజుల వారి నిరీక్షణకు రాజమౌళి మాత్రం ట్రిపుల్ టన్స్ లో టీజర్ తో గిఫ్ట్ ఇస్తారని బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి కూడా టీజర్ ను ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రామాణికాలతో కట్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ దాహం తీరడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు