జపాన్ అభిమాని మాటలకు ఎన్టీఆర్ ఫిదా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలను తెరకెక్కి్స్తూ బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘దేవర’ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్‌లో తారక్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన కొందరు అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించాడు.

వారిలో ఓ జపాన్ అభిమాని చెప్పిన మాటలకు తారక్ ఫిదా అయ్యానంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకుంటున్నట్లు తనకు చెప్పడం నిజంగా సంతోషాన్ని కలిగించిందిన.. భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమా హద్దులు చెరిపేస్తుంది.. ఇలాంటి సినిమాలు అభిమానులను ఏదైనా నేర్చుకునేందుకు ప్రేరేపించడం తనకు అమితమైన ఆనందాన్ని కలిగించిందంటూ తారక్ పోస్ట్ చేశాడు.

ఇలా ఓ జపాన్ అభిమాని చెప్పిన మాటలకు తారక్ ఫిదా కావడం.. ఇదే విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్-2’, ‘ఎన్టీఆర్-నీల్’ చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version