యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మిర్చి ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఎవరివి వారు వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన ఆ వార్తలు ఆగిపోయాయి. తాజాగా మాకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న సినిమాతో బిజీగా ఉంటే, కొరటాల శివ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ – కొరటాల శివ సినిమా మొదలుతుంది. ఎక్కువ భాగం ఈ సినిమా 2016 జనవరి లేదా ఆ ఏడాది మొదట్లో అధికారికంగా మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే కొరటాల శివ ఓ పవర్ఫుల్ స్టొరీ లైన్ తో కథని సిద్దం చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాకి ఓ టాప్ ప్రొడ్యూసర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. హీరో కోసం మాస్ క్యారెక్టర్ ని రూపొందిచడంలో, దానికి తగ్గా పవర్ఫుల్ డైలాగ్స్ రాయడంలో కొరటాల శివకి మంచి పేరుంది. అదే రీతిలోనే ఎన్.టి.ఆర్ కోసం ఓ స్పెషల్ స్టొరీని రెడీ చేస్తున్నాడని సమాచారం.


