లంకకు చేరుతున్న రాముడు.. ఎందుకంటే?

లంకకు చేరుతున్న రాముడు.. ఎందుకంటే?

Published on Mar 23, 2025 3:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ చిత్ర షూటింగ్ ముగించుకుని తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ చిత్ర షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, త్వరలోనే ఎన్టీఆర్ కూడా ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు.

కాగా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంకలో షూట్ చేయనున్నారట చిత్ర యూనిట్. ఈ మధ్య కాలంలో శ్రీలంకలో ఇండియన్ సినిమాలు ఏవీ కూడా షూటింగ్ జరుపుకోలేదు. దీంతో ఇప్పుడు లంకలో రాముడు అడుగుపెట్టనున్నాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వార్తతో ఎన్టీఆర్-నీల్ మూవీని ట్రెండ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ కోసం శ్రీలంక ప్రభుత్వం నుంచి అవసరమైన పర్మిషన్ లు తెచ్చుకునే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉందట. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు