‘యూ.ఎస్.ఏ’కి బయలుదేరిన ఎన్టీఆర్

‘యూ.ఎస్.ఏ’కి బయలుదేరిన ఎన్టీఆర్

Published on Sep 23, 2024 10:10 AM IST

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘దేవర’ చిత్రం పై ఇతర దేశాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ యూ.ఎస్.ఏ కి బయలుదేరి వెళ్ళాడు. బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’ స్క్రీనింగ్‌కు హాజరు కావడానికి ఎన్టీఆర్ లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరారు. అక్కడ ‘దేవర’ స్క్రీనింగ్ సెప్టెంబర్ 26న షెడ్యూల్ చేయబడింది. లాస్ ఏంజెల్స్‌ లో ‘దేవర’ స్క్రీనింగ్ తో పాటు యూ.ఎస్.ఏలోని తెలుగు ప్రేక్షకుల కోసం అక్కడ ‘దేవర’ ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటాడని తెలుస్తోంది.

మొత్తానికి పాన్ ఇండియా రేంజ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర సినిమా ఫీవరే కనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. పైగా నిన్న రిలీజ్ అయిన ‘దేవర రిలీజ్ ట్రైలర్’ కూడా సినిమా పై అంచనాలను మరింతగా పెంచింది. మరి అదే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కూడా సరికొత్త రికార్డులను దేవర క్రియేట్ చేస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు