సమ్మర్ బ్రేక్ లేదంటున్న ఎన్టీఆర్, చరణ్

సమ్మర్ బ్రేక్ లేదంటున్న ఎన్టీఆర్, చరణ్

Published on Apr 12, 2025 1:04 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వీరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘వార్-2’, ప్రశాంత్ నీల్ మూవీలను లైన్‌లో పెడుతున్నాడు. ఇక మరో స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు.

అయితే, ప్రతి సమ్మర్‌లో స్టార్ హీరోలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి వెకేషన్ వెళ్తుంటారు. కానీ, ఈసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా సమ్మర్ బ్రేక్ లేదని చెబుతున్నారు. దీనికి వారు కమిట్ అయిన సినిమాలను త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ నెలలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. దీంతో మే నెలలో కూడా ఈ చిత్ర షూటింగ్‌లో ఆయన బిజీగా ఉండనున్నాడట.

ఇక చరణ్ కూడా పెద్ది కంటిన్యూ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండనున్నాడట. దీంతో ఆయన కూడా బ్రేక్‌కు నో చెబుతున్నాడు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు వేసవి బ్రేక్ లేకుండా వర్క్ చేస్తుండటంతో అభిమానుల్లో ఈ చిత్రాలపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు