Devara: ‘దేవర’తో తారక్ రేర్ ఫీట్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఈ సినిమాతో తమ ఆకలి తీరిందని నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ దగ్గర కళ్లుచెదిరే వసూళ్లతో ‘దేవర’ దండయాత్ర చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే, ‘దేవర’ చిత్రంతో తారక్ ఓ రేర్ ఫీట్‌ను సాధించాడని అభిమానులు నెట్టింట చర్చించుకుంటున్నారు. పదేళ్లుగా తమ హీరో ఒక్క ఫ్లాప్ లేకుండా సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారాడంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. 2015లో టెంపర్‌తో ఎన్టీఆర్ విజయయాత్ర మొదలైందని.. ఆ తరువాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ వచ్చాడు.

ఇప్పుడు ‘దేవర’తో తన విజయయాత్రను తారక్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక టాలీవుడ్‌లో ఎప్పటినుండో ఉన్న ఓ మిత్‌ని కూడా తారక్ బ్రేక్ చేశాడు. దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళితో సినిమా చేసిన హీరో తన తరువాత చిత్రంతో డిజాస్టర్‌ను మూటగట్టుకుంటాడు అనే టాక్ ఉంది. అయితే, ‘దేవర’తో తారక్ ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేర్ ఫీట్ సాధించిన తారక్‌ను అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Exit mobile version