ఎన్టీఆర్ రికమెండ్ చేసిన బెస్ట్ హైదరాబాద్ హోటల్స్ ఇవే!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లో ‘దేవర’ చిత్ర ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఆయన అక్కడ అభిమానులతో, మీడియాతో ‘దేవర’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడ జపాన్‌లో ఈ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఓ జపాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తెలుగు ఫుడ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తారక్‌కు ఇష్టమైన తెలుగు ఫుడ్ కోసం ఆయన రికమెండ్ చేసే ప్లేసెస్ ఏమిటని యాంకర్ ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని పలు బెస్ట్ హోటల్స్ పేర్లను రికమెండ్ చేశారు. షోయు, షాదాబ్, స్పైస్ వెన్యూ, కాకతీయ డీలక్స్ మెస్, తెలంగాణ స్పై్స్ కిచెన్, పాలమూరు గ్రిల్ హోటల్స్‌ను ఆయన రికమెండ్ చేశారు. వీటిలో దొరికే ఫుడ్ తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ ఫుడ్ అని ఆయన తెలిపారు.

ఇక తారక్ రికమెండ్ చేసిన హోటల్స్ పై అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఫుడ్ గురించి బాగా తెలుసు కాబట్టే, తారక్ ఇలాంటి బెస్ట్ ప్లేసెస్‌ను రికమెండ్ చేశాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తారక్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాలు ‘వార్-2’, ఎన్టీఆర్-నీల్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version