Devara: అందుకే రెండు భాగాలుగా ‘దేవర’ – ఎన్టీఆర్

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ‘దేవర’. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను పాతర వేసేందుకు ‘దేవర’ సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ తారాస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్, స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్‌లకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో తారక్ ‘దేవర’ చిత్రానికి సంబంధించి చాలా విషయాలను పంచుకున్నాడు. ‘దేవర’ చిత్రాన్ని రెండు భాగాలుగా ఎందుకు తెరకెక్కించారనే విషయంపై ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపాడు. ‘దేవర’ సినిమా కథలోని పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయని.. అందుకే వాటిని పూర్తిగా డెవెలప్ చేయాలని కొరటాల శివకు సూచించినట్లుగా తారక్ తెలిపాడు.

అలా క్యారెక్టర్స్ అన్ని డెవెలప్ చేసిన తరువాత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తమకు ఓ విషయాన్ని చెప్పి షాక్ ఇచ్చాడని.. ఫస్టాఫ్ పూర్తి కాకముందే, సినిమా నిడివి 5 గంటలు దాటిందని ఆయన తెలిపినట్లుగా తారక్ అన్నాడు. దీంతో వారు ఖంగుతిని.. ఇక ‘దేవర’ చిత్రాన్ని ఖచ్చితంగా రెండు భాగాలుగా తీయాల్సిందేనని డిసైడ్ అయ్యినట్లుగా తెలిపాడు.

‘దేవర’ను రెండు భాగాలుగా తెరకెక్కించడం వెనుక ఉన్న కారణాన్ని తారక్ రివీల్ చేయడంతో, ఈ సినిమాలోని కథ ఎలా ఉండబోతుందా.. అసలు తారక్-కొరటాల కలిసి ప్రేక్షకులకు ఎలాంటి కథను చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘దేవర’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version