గత మార్చ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన డిజాస్టర్ “ఆరెంజ్” రీరిలీజ్ ల విషయంలో భారీ రెస్పాన్స్ అందుకోగా ఇక ఇప్పుడు తన కో స్టార్ అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “సింహాద్రి” రీ రిలీజ్ తో అయితే తారక్ ఫ్యాన్స్ ఈ మే నెలని కమ్మేసారు. గతంలో ఏ సినిమా రీ రిలీజ్ కి కూడా జరగని సాలిడ్ ప్లానింగ్స్ తో వస్తుండగా ఇప్పుడు ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ అన్ని చోట్ల కూడా నమోదు అవుతుండడం విశేషం.
తెలుగు రాష్ట్రాలు సహా ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే హౌస్ ఫుల్స్ పడిపోతున్నాయి. దీనితో ఈ చిత్రం విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ మాస్ హిట్ అయితే ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో అనేది కూడా అందరిలో ఆసక్తిగా ఉంది. ఇక ఈ చిత్రానికి దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా భూమిక హీరోయిన్ గా నటించింది. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే.


