Devara: ఇది 9 గంటల సినిమా..!

Devara: ఇది 9 గంటల సినిమా..!

Published on Sep 20, 2024 6:31 PM IST

మరో వారం రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ‘దేవర’ మేనియా కనిపించనుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను శరవేగంగా చేస్తున్నారు.

ఇందులో భాగంగా తెలుగు యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ‘దేవర’ హీరో అండ్ డైరెక్టర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర మూవీకి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.

నిజానికి ‘దేవర’ కథ చాలా పెద్దదని.. తాము ఈ సినిమాలో కొంత కథను మాత్రమే చూపిస్తున్నామని.. ఈ సినిమా పూర్తిగా తీస్తే 9 గంటల సినిమా అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో అసలు ‘దేవర’ కథ ఏమిటా అని మరింత ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు