‘మ్యాడ్ స్క్వేర్’ కోసం వస్తున్న NTR

‘మ్యాడ్ స్క్వేర్’ కోసం వస్తున్న NTR

Published on Apr 3, 2025 3:00 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్‌తో దూసుకెళ్తోంది. కథతో సంబంధం లేకుండా ఈ సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా లభిస్తున్నాయి. ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణతో ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఈ సక్సెస్ మీట్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నాడట. దీంతో ఈ సక్సెస్ మీట్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి క్రియేట్ అవుతుంది.

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీలో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు