కన్ఫర్మ్: కళ్యాణ్ రామ్ కోసం మరోసారి ఎన్టీఆర్.. ఎప్పుడంటే?

కన్ఫర్మ్: కళ్యాణ్ రామ్ కోసం మరోసారి ఎన్టీఆర్.. ఎప్పుడంటే?

Published on Apr 9, 2025 10:00 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’ ఇప్పటికే ప్రమోషన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.

ఇక నేడు ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను చిత్తూరులోని ఎస్వీ సెట్‌లో లాంచ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్రం ప్రతి తల్లి, కొడుకు కలిసి చూడాలని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 12న నిర్వహిస్తామని.. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ రానున్నాడని కళ్యాణ్ రామ్ రివీల్ చేశాడు.

దీంతో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సోహెల్ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు