మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను కొరటాల శివ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా దసరా వరకు ఎలాంటి ఢోకా లేకుండా రన్ అవుతుందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.
కాగా, ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, తన నెక్స్ట్ మూవీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘వార్-2’ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమేర షూటింగ్ చేసిన ఎన్టీఆర్, తన చేతికి గాయం కావడంతో ‘వార్-2’ చిత్రానికి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌ను అక్టోబర్ 9 నుంచి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
ఈ షెడ్యూల్‌లో తారక్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అందాల భామ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.