‘వార్-2’లో సర్‌ప్రైజ్ చేయబోతున్న ఎన్టీఆర్..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘వార్-2’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో నటిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘వార్-2’ మూవీలో ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని.. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని.. ముఖ్యంగా హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.

‘వార్-2’ మూవీలో ఎన్టీఆర్ రోల్‌పై వస్తున్న వార్తలతో అభిమానులు ఈ సినిమాలో తమ అభిమాన హీరో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version