యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రభస’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఆగష్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రభస’ రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుండగానే ఎన్.టి.ఆర్ పూరి జగన్నాద్ డైరెక్షన్ లో తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది.
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ మొట్ట మొదటి సారిగా ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎన్.టి.ఆర్ కెరీర్లోనే వైవిధ్యంగా ఉంటుందని సమాచారం.ఇప్పటికే పూరి జగన్నాధ్ తన గత సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్ని చాలా డిఫరెంట్ గా చూపించాడు. ఎప్పటి లానే ఇందులో కూడా
పూరి తన మార్క్ టిపికల్ స్టైల్ ని, మానరిజంని కూడా జత చేసి మాస్ ఆడియన్స్ కి ఎన్.టి.ఆర్ ని చాలా వైవిధ్యంగా చూపించనున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా వక్కంతం వంశీ కథని అందించాడు.
వచ్చే వారం నుంచి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. కాజల్ అగర్వాల్, మధురిమ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. 2015 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


