దేవర: బిగ్ అప్డేట్ ను అందించిన ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ను హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దేవర చిత్రానికి తన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది అని ఎన్టీఆర్ తెలిపాడు. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం అని, సముద్రమంత ప్రేమను, అధ్బుతమైన టీమ్ ను ఇక మిస్ అవుతా అని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 27 న దర్శకుడు శివ రూపొందించిన ప్రపంచంలోకి అందరూ ప్రయాణించే వరకూ వేచి ఉండలేను అని తెలిపాడు. అయితే సెట్స్ నుండి ఒక ఫోటోను కూడా షేర్ చేశాడు. దర్శకుడు శివ తో కలిస్ ఉన్న ఈ ఫోటో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Exit mobile version