‘గేమ్ ఛేంజర్’ ఆ మార్క్ ను అందుకుంటుందా ?

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దేవర 1’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్నాడు. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ‘దేవర’ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఓపెనింగ్స్ విషయంలో దేవర ఆ అంచనాలను అందుకుంది. ఐతే, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటించడంతో ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్ – దేవర’ మధ్య లింక్ పెడుతున్నారు ఫ్యాన్స్.

డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతున్న గేమ్ ఛేంజర్ కూడా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూళ్లు చేసి దేవర రికార్డ్ ను అందుకోవాలని చరణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాకపోతే, శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు-2 సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా పై ఆ సినిమా ప్రభావం పడింది. కానీ, ఇక్కడ హీరో చరణ్ కాబట్టి, భారీ అంచనాల మధ్య సినిమా వస్తోంది కాబట్టి, 172 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ ను అందుకుంటుందేమో చూడాలి.

Exit mobile version